అరవై రోజుల్లో సర్కారీ కొలువు
* సచివాలయాల్లో మొత్తం ఖాళీలు 1,28,589 
* పరీక్షలకు నాలుగంచెల ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్తగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తోంది. వీటిల్లోకి అవసరమైన సిబ్బంది కోసం భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. అక్టోబరు 2 నాటికి ఈ ఉద్యోగులు విధుల్లో ఉండాలని భావిస్తోంది. అంటే ఈ పరీక్షలకు హాజరయ్యేవారు అరవై రోజుల్లో సర్కారీ కొలువులో చేరిపోవచ్చు. రాత పరీక్షకు నెలరోజుల సమయమే ఉంది. లక్షలమందితో జరిగే పోటీలో నిలవాలంటే తాజా అభ్యర్థులు, సీనియర్లు తగిన ప్రిపరేషన్‌ వ్యూహాలను రూపొందించుకోవాలి.

Comments